దిల్సుఖ్నగర్పై ప్రత్యేక నిఘా
దిల్సుఖ్నగర్ ప్రాంతంపై పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. రెండు తెలుగు రాష్ర్టాలతో పాటు దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన వారు వలసవచ్చి ఇక్కడి హాస్టళ్లలో తాత్కాలిక షెల్డర్ పొందుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు, అర్ధరాత్రులు రోడ్లపై సంచరిస్తూ డ్రగ్స్‌తో పాటు ఇతర వ్యసనాలకు బానిసలుగా మారుతున్న వైనం స్పష్టంగా కన్పిస్తున్నది.
- హాస్టళ్ల నిర్వాహకులతో కో ఆర్డినేషన్.. విచ్చలవిడిగా తిరిగితే అరదండాలే
- అర్ధరాత్రి రోడ్లపై కనిపిస్తే డ్రగ్స్ టెస్టులు.. మల్కాజ్గిరి సీపీ సుమతి ప్రత్యేక దృష్టి
ఎల్బీనగర్, మే 8: దిల్సుఖ్నగర్ ప్రాంతంపై పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. రెండు తెలుగు రాష్ర్టాలతో పాటు దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన వారు వలసవచ్చి ఇక్కడి హాస్టళ్లలో తాత్కాలిక షెల్డర్ పొందుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు, అర్ధరాత్రులు రోడ్లపై సంచరిస్తూ డ్రగ్స్‌తో పాటు ఇతర వ్యసనాలకు బానిసలుగా మారుతున్న వైనం స్పష్టంగా కన్పిస్తున్నది. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్న రోజే సాధారణ సగటు మహిళగా దిల్సుఖ్నగర్ బస్టాండ్ ప్రాంతంలో అర్ధరాత్రి సంచరించి పోకిరీలు, ఆకతాయిల ఆగడాలను ప్రత్యక్షంగా చూసిన సుమతి.. ఈ వ్యవహరంపై సీరియన్‌గా చర్యలు తీసుకుంటున్నారు. తాను చూసిన పరిస్థితిని చక్కదిద్దడంలో భాగంగా దిల్‌సుఖ్‌నగర్‌లో హాస్టళ్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించి పరిస్థితులన్నీ మారిపోకపోతే కఠినంగా వ్యహరిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే అర్ధరాత్రి రోడ్లపై సంచరించే వారిపై డ్రగ్స్, ఇతర వ్యాపకాలపై డ్రోన్ నిఘా పెట్టి వారి భరతం పడతామని పోలీసులు అంటున్నారు.
630 హాస్టళ్ల సెక్యూరిటీ ఆడిట్..
ఇదిలా ఉంటే.. దిల్సుఖ్నగరప్రాంతంలో 630 హాస్టళ్లను గుర్తించిన పోలీస్ అధికారులు.. ఆయా హాస్టళ్లలో సెక్యూరిటీ ఆడిట్ చేశారు. ఇందులో హాస్టల్ ఎంత సురక్షితం, అందులో ఉన్న వారు ఎంత సురక్షితం, వారి రాకపోకలు ఎంత సురక్షితం, వారు ఏ కారణం చేత వచ్చారో.. ఆ పనిలోనే ఉన్నారా అన్న పూర్తి సమాచారం సేకరించారు. యువత కొందరు వ్యాపరం ముసుగులో డ్రగ్స్ సరఫరా చేయడం, వాడే ప్రదేశాలపై ప్రస్తుతం పోలీసులు నిఘా పెట్టనున్నారు. అదే విధంగా మైనర్లను వ్యబిచారంలోకి దింపే వారి వ్యవహారంపై కూడా నిఘా ఉంటుందని పోలీసులు భరోసా ఇస్తున్నారు. హాస్టళ్లలో ఉంటున్నవారు కాకుండా హాస్టల్‌కు సంబంధం లేని వారు హాస్టళ్లలో సంచరించే పరిస్థితులు ఉంటే ఆయా యాజమాన్యాలపై నిఘా పెట్టి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అవసరమైతే కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు చేసి.. చర్యలు తీసుకుంటామని సీపీ స్పష్టం చేశారు.
నిఘా కెమెరాలు 3200 ఉన్నా..
దిల్సుఖ్నగర్ ప్రాంతంలో సుమారు 630 హాస్టళ్లు ఉన్నాయి. హాస్టళ్లలోని యువకులు అర్ధరాత్రి సమయాల్లో రోడ్లపైకి రావడంతో పాటు హాస్టళ్ల పరిసరాల్లోని వీధులో పరిస్థితులను గమనిస్తే ముచ్చట్లు.. షికార్లు చేస్తున్న వైనం.. ఆయా కాలనీవాసులు తమకు ఇబ్బందిగా మారిందని కూడా వాపోతున్నారు. మొత్తంగా 3,200 సీసీ కెమెరాల నిఘా ఉందని చెబుతున్నా.. వీరిని మాత్రం అదుపు చేయలేక పోతున్నారు.
పాన్ డబ్బాలే మత్తు విక్రయ కేంద్రాలు..!
సిటీబ్యూరో, మే 8 (నమస్తే తెలంగాణ): మత్తు పదార్థాల విక్రయాల్లో పాన్ డబ్బాలే కీలకంగా మారుతున్నాయని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా పాన్ డబ్బాలపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నిషేధిత పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. దిల్సుఖ్నగర్ ప్రాంతంలో ఇటీవల అర్ధరాత్రి ఆమె నిర్వహించిన ఆపరేషన్‌తో మహిళల భద్రత డొల్లతనం బయటపడిన విషయం తెలిసిందే. ఇందుకు ప్రధాన కారణం అర్ధరాత్రి రోడ్లపై యువత విచ్చలవిడిగా తిరుగుతుండడం, పెట్రోలింగ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, రోడ్లపై తిరిగే యువతలో చాలా మంది మత్తుపదార్థాలు, మద్యం తీసుకున్నట్లు గుర్తించారు. మత్తుపదార్థాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయంటూ అధికారులకు చెబుతున్నా..ఎవరూ పట్టించుకోవడం లేదని, గంజాయి బ్యాచ్‌లు చెలరేగి పోతున్నాయంటూ సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

