చార్మినార్, జూన్ 8 : హజ్రత్ ఖాజా మోహినుద్దీన్ చిస్తీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గోషామహల్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ పీసీసీ సభ్యులు ఖాజా గయాసుద్దీన్తోపాటు మరికొందరు కాంగ్రెస్ నాయకులు బుధవారం కాలపత్తర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా, మత కలహాలు సృష్టించే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ మూసా ఖాసీం, సయ్యద్ ఎక్బాల్, కుద్దూస్, తదితరులు పాల్గొన్నారు.