సిటీబ్యూరో, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ)/మెహిదీపట్నం: సామాన్యులను ఇబ్బందులకు గురి చేయకుండా గణేశ్, మిలాద్ ఉన్ నబీ పండుగలను ప్రశాంత వాతావారణంలో నిర్వహించాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచించారు.
బుధవారం మెహిదీపట్నంలోని దక్షిణ, పశ్చిమ మండలం డీసీపీ కార్యాలయంలో సౌత్ వెస్ట్ జోన్లోని శాంతిభద్రతలు, ట్రాఫిక్, ఎస్బీ, టాస్క్ఫోర్స్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా విభాగాల నుంచి ప్రస్తుతం గణేశ్, మిలాద్ ఉన్ నబీ పండుగల ఏర్పాట్లపై తీసుకుంటున్న చర్యలపై ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. విధుల నిర్వహణలో ఒత్తిడి లేకుండా ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు.