హైదరాబాద్ : గిరిజన విద్యార్థి సంఘం పిలుపు మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి కార్యక్రమంలో భాగంగా లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మూడవత్ రాంబల్ నాయక్‌ను కేశంపేట పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అక్రమ అరెస్టు చేసిన లంబాడి హక్కుల పోరాట సమితి నాయకులను కార్యకర్తలను తక్షణమే భేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని కొంతమంది కోయ, గోండు నాయకులు వారిని నడిపిస్తున్న కొంతమంది ప్రభుత్వంలోని పెద్దల అరాచక చర్యలను నిరసిస్తూ ఈరోజు గిరిజన విద్యార్థి సంఘం నాయకులు సీఎం ఇల్లు ముట్టడి కార్యక్రమం పిలుపునిచ్చినట్లు తెలిపారు. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా లంబాడి హక్కుల పోరాట సమితి నాయకులు, కార్యకర్తలను ముందస్తు అరెస్టు చేయడం అప్రజాస్వామికం అన్నారు. తక్షణమే వారిని విడుదల చేయాలన్నారు.