అమీర్పేట : జెక్ కాలనీ రెసిడెన్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం కాలనీ పరిసరాల్లో హరితహారం ( Harithaharam) నిర్వహించారు. ఫెడరేషన్ అధ్యక్షులు డాక్టర్ మల్లు ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ బీజేపీ నాయకులు లింగంపల్లి నర్సింగరావు ( Narsing rao) పాల్గొని మొక్కలు (Plantation) నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతిని కాపాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మొక్కల పెంపకం ఎంతో అవసరమని అన్నారు.
చెట్లను నరకడం వల్ల అనేక అనర్థాలు జరుగుతున్నాయని, ముఖ్యంగా వాతావరణం కలుషితమవుతూ అనేక రోగాలు వస్తున్నాయని పేర్కొన్నారు. జెక్ కాలనీలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడం ద్వారా ఆహ్లాదకర వాతావరణాన్ని పెంపొందించేందుకు ఫెడరేషన్ చేస్తున్న కృషిని లింగంపల్లి నర్సింగరావు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ ప్రతినిధులు వెంకట్, సోమ తదితరులు పాల్గొన్నారు.