ముషీరాబాద్, జూలై 4: పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శనివారం జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య వర్ధంతి సభ రాంనగర్ ఈ సేవా వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొని పింగళి వెంకయ్య చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్ విభాగం నేత ముఠా జయసింహ, పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్టు చైర్మన్ శ్యామలరావు, బీఆర్ఎస్ నాయకులు నేత శ్రీనివాస్, రవియాదవ్, శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణ, శ్యామ్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.