హయత్‌నగర్, సెప్టెంబర్ 27: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. ఎస్ఐ కట్ట వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హస్తినాపురం నివాసి రవీందర్‌రెడ్డి (47) రియల్ ఎస్టేట్ వ్యాపారి.
పెద్దఅంబర్‌పేట నుంచి ఎల్బీనగర్కు వైపు వెళ్తుండగా.. రవీందర్‌రెడ్డి ప్రయాణిస్తున్న స్కూటీ.. ముందుగా వెళ్తున్న టస్కర్ లారీని ఢీకొనడంతో అతడు కిందపడిపోయాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.