గురువారం 03 డిసెంబర్ 2020
Hyderabad - Oct 27, 2020 , 09:16:34

వాకింగ్‌ కోసం వచ్చి చెరువులో పడి వ్యక్తి ...

వాకింగ్‌ కోసం వచ్చి చెరువులో పడి వ్యక్తి ...

 బంజారాహిల్స్‌ : వాకింగ్‌ కోసం వచ్చిన ఓ వ్యక్తి కాలుజారి చెరువులో పడి మృతి చెందా డు. ఈ సంఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. టోలీచౌకి సమీపంలోని ఐఏఎ స్‌ కాలనీలో నివాసం ఉంటున్న మహ్మద్‌ అహ్మదుద్దీన్‌ ఖాన్‌(34) ప్రైవేటు ఉద్యోగి. ఇటీవల అతడికి డయాబెటీస్‌ రాగా.. రోజూ వాకింగ్‌ చేస్తున్నాడు. ఈ నెల 23న తెల్లవారుజామున బంజారాహిల్స్‌ రోడ్‌ నం.12, లోటస్‌ పాండ్‌లోని వాకింగ్‌ ట్రాక్‌లో వాకింగ్‌ చేస్తున్నాడు. వేగంగా వాకింగ్‌ చేస్తుండగా.. ట్రాక్‌ పక్కన ఉన్న టాప్‌కు తగిలి.. అదుపుతప్పి పక్కనున్న చెరువులో పడిపోయాడు.  చీకటిగా ఉండటంతో ఈ విషయాన్ని ఎవరూ గుర్తింలేదు. కాగా... వాకింగ్‌ కోసం వెళ్లిన తమ సోదరుడు తిరిగి రాలేదంటూ సాయం త్రం అతడి సోదరుడు సైఫుద్దీన్‌ ఖాన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటికే లోటస్‌పాండ్‌లో మృతదేహం కనిపించడంతో పోలీసులు ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ మేరకు మృతుడి సోదరుడికి అహ్మదుద్దీన్‌ ఫొటో చూపించగా గుర్తించాడు. పోలీసులు కేసు  దర్యాప్తు చేపట్టారు.