Srinivas Goud | సీఎం ఫుట్ బాల్ ఆడటం కాదు. మంత్రులు ఆందరూ ఫుట్ బాల్ ఆడినా మాకు అభ్యంతరం లేదు
..? హామీలు అమలు చేసి ఆటలు ఆడుకోండి..హామీలు అమలు చేయకుండా ఎంత సేపు కేసీఆర్, కేటీఆర్‌లను తిట్టడమే పనా..? మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు.. మా పార్టీలో పదేళ్లు ఉండి వెళ్లిన వారు కూడా మా పదేళ్ల పాలనపై విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ.. సీఎం రెండు సంవత్సరాల పాలన సందర్భంగా మా ఉమ్మడి జిల్లాలో విజయోత్సవాల ప్రారంభ సభ నిర్వహించారు. చేసింది, చేయబోయేది సీఎం చెప్పుకోవాలి
.. కానీ ఎప్పటి మాదిరిగానే కేసీఆర్‌ను తిట్టడాన్నే సీఎం పనిగా పెట్టుకున్నారు. మంచి పనులు చేయలేదు కనుకే సీఎం సభకు జనం రాలేదు. మంత్రి శ్రీహరి స్వయంగా సభకు జనం రాకపోవడం పట్ల ఆవేదనతో మాట్లాడారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏమీ చేయలేదని సీఎం పచ్చి అబద్దాలు మాట్లాడారు.. కేసీఆర్ ఎంపీగా ఏం చేయలేదని పిచ్చి మాటలు మాట్లాడారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఐదు జిల్లా కేంద్రాలు ఇచ్చింది కేసీఆర్ కాదా ? .. ఐదు మెడికల్ కాలేజీలు ఇచ్చింది కేసీఆర్ కాదా ?… కల్వకుర్తి ,నెట్టెంపాడు పూర్తి చేసింది కేసీఆర్ కాదా ?.. అని ప్రశ్నల వర్షం కురిపించారు.
భూగర్భ జలాలు పెంచింది కేసీఆర్ కాదా? ..
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి పది లక్షల ఎకరాలకు నీళ్లిచ్చింది కేసీఆర్ ప్రభుత్వంలో కాదా ? అని శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు. ఐదు కొత్త రిజర్వాయర్లు జిల్లాలో కట్టింది కేసీఆర్ కాదా ? …30 లక్షల టన్నుల వరి ధాన్యం పండించే స్థాయి నుంచి 3 కోట్ల టన్నుల స్థాయికి తీసుకెళ్లింది కేసీఆర్ కాదా ? .. వందల చెరువులు బాగు చేసి, వందల చెక్ డ్యామ్‌లు కట్టి భూగర్భ జలాలు పెంచింది కేసీఆర్ కాదా? .. మహబూబ్ నగర్ పట్టణంలో 15 రోజులకోసారి మంచి నీళ్లు ఇచ్చే పరిస్థితిని మార్చి రోజూ నీళ్లిచ్చే పరిస్థితి కల్పించింది కేసీఆర్ పాలన కాదా ?
పది శాతం పనులు పూర్తి చేస్తే పూర్తయ్యే పాలమూరు రంగారెడ్డిని ఎందుకు పూర్తి చేయలేదో సీఎం చెప్పాలి.. ఆరు గ్యారంటీలు అమలు చేయనందుకు విజయోత్సవాలు చేసుకుంటున్నారా ?. అన్ని వర్గాలకు హామీ లిచ్చి మోసం చేసినందుకు సంబరాలు చేసుకుంటున్నారా ?.. డిక్లరేషన్లు అమలు చేయనందుకు సంబరాలా ?. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఎగ్గొట్టినందుకు సంబరాలా ?.. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వనందుకు సంబరాలా ?…రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు తేనందుకు సంబరాలా ? అని ప్రశ్నించారు.
రేషన్ కార్డులు మేము ఆన్ లైన్లో అప్లై చేసుకున్న వారికి ఇచ్చాము .ప్రచారం చేసుకోలేదు…కేసీఆర్ పాలన లో రేషన్ కార్డులు ఇవ్వలేదని సీ ఎస్ కు చెప్పే పరిస్థితి ఉందన్నారు.
Sanchar Sathi App: సంచార్ సాథీ యాప్‌ను డిలీట్ చేసుకోవచ్చు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి సింథియా