కొండాపూర్, ఫిబ్రవరి 3 : రాష్ట్ర ప్రభుత్వ(Congress Govt) సంక్షేమ పథకాల దరఖాస్తుదారులకు కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దరఖాస్తు చేసేందుకు(Government schemes) సెంటర్లకు విచ్చేస్తున్న మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు మండుటెండలో క్యూ లైన్లలో నిలబడక తప్పటం లేదు. శేరిలింగంపల్లి సర్కిల్ -20 పరిధిలోని కొండాపూర్ డివిజన్ అంజయ్యనగర్ వార్డు కార్యాలయంలో సంక్షేమ పథకాల కోసం అధికారులు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
కాగా, డివిజన్ వ్యాప్తంగా ఉన్న వారు దరఖాస్తు చేసుకునేందుకు ఇక్కడికి వస్తుండడంతో, అక్కడ కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎండలు మండుతుండడంతో కనీసం ఒక టెంట్ కూడా ఏర్పాటు చేయలేదంటున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులతో ఎండలో నిలబడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక కార్పొరేటర్, ఎమ్మెల్యేలు చొరవ తీసుకుని సౌకర్యాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.