ఆర్కేపురం, మే 24 : ఆర్కేపురం డివిజన్ పరిధిలో ఉన్న చిత్రలేఅవుట్ కాలనీలో పది రోజులుగా కలుషిత నీటి సరఫరా అవుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. మంచినీటిలో డ్రైనేజీ నీళ్లు కలవడంతో దుర్గంధంతో పాటు దుర్వాసనతో పాటు నురుగు రూపంలో వస్తుండటంతో ప్రజలు వాటిని తాగలేకపోతున్నారు. దీంతో ప్రతిరోజూ ట్యాంకర్ల ద్వారా నీరు కొనుగోలు చేస్తున్నారు. ఈ సమస్యపై జలమండలి అధికారులకు ఫిర్యాదు చేస్తే సిబ్బందిని పంపించి పైప్‌లైన్ తవ్వి సమస్యను గుర్తించకుండా వదిలేశారు.
కలుషితనీటి సమస్యను పరిష్కరించాలని జలమండలి అధికారులకు ఫిర్యాదు చేస్తే కేవలం ఒక్కరోజు వచ్చి పైప్‌లైన్ తవ్వి హడావుడి చేసి సమస్యను పరిష్కరించకుండా వెళ్లిపోయారు. మరో వైపు కాలనీలో మ్యాన్‌హోల్స్ నిండిపోయి భూగర్భ జలాలు సైతం కలుషితమవుతున్నాయి. కలుషిత నీరు సరఫరా అవుతుండడంతో ట్యాంకర్ల ద్వారా నీరు కొనుగోలు చేస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి’ అని కాలనీ అధ్యక్షుడు పెండ్యాల నగేశ్ అన్నారు.