ఇబ్బందులు లేకుండా చర్యలు
కంటోన్మెంట్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కంటోన్మెంట్‌లోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మోండా మార్కెట్, రెజిమెంటల్‌బజార్, అంబేద్కర్‌నగర్, మారేడ్‌పల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్డు, చిలకలగూడ చౌరస్తా, మహేంద్రాహిల్స్, వాల్మీకినగర్, కార్ఖానా తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షాని కి ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి.
- సహాయక చర్యలు చేపట్టిన జీహెచ్ఎంసీ, జలమండలి, డీఆర్ఎఫ్ సిబ్బంది..
మారేడ్‌పల్లి, జూలై 26: కంటోన్మెంట్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కంటోన్మెంట్‌లోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మోండా మార్కెట్, రెజిమెంటల్‌బజార్, అంబేద్కర్‌నగర్, మారేడ్‌పల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్డు, చిలకలగూడ చౌరస్తా, మహేంద్రాహిల్స్, వాల్మీకినగర్, కార్ఖానా తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షాని కి ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి.ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు అత్యవసరమైతే తప్పా ఇంటి నుంచి బయటికి రావొద్దని ప్రజలకు సూచించారు.

సహాయక చర్యల్లో జీహెచ్ఎంసీ, జలమండలి సిబ్బంది..
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మోండా డివిజన్లో పలు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ, జలమండలి సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
రెజిమెంటల్‌బజార్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాల రోడ్డు పక్కన ఓ చెట్టు కూలిపోవడంతో వెంటనే సమాచారం అందుకున్న డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని చెట్టును తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు.
సికింద్రాబాద్ రైతిఫైల్ బస్టాండ్, ఒలిఫెంటా బ్రిడ్జి తదితర ప్రాంతాల్లో వర్షం నీరు భారీగా నిలిచిపోవడంతో జీహెచ్ఎంసీ, జలమండలి , మాన్సూన్ అత్యవసర సిబ్బంది వర్షం నీరు సాఫీగా వెళ్లే విధంగా సహాయక చర్యలు చేపట్టారు.
రెజిమెంటల్‌బజార్, మారేడ్‌పల్లి, సజ్జన్‌లాల్ స్ట్రీట్, అంబేద్కర్‌నగర్, గురుద్వార్ మందిర్ తదితర ప్రాంతాల్లో వర్షం నీటి కాలువలలో నీటి ప్రవాహానికి అడ్డంగా ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు, చెట్ల కొమ్మలు, చెత్త, చెదారాన్ని తొలగించి వర్షం నీరు వెళ్లే విధంగా చర్యలు తీసుకున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- DRF
- GHMC
- Jalmandali
- Rains
RELATED ARTICLES
తాజా వార్తలు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

