Patlolla Karthik Reddy | బుద్ధున్న గాడిది ఎవడైనా రూ.200 కోట్ల వ్యాపారం నడుస్తున్న మార్కెట్‌ను బంద్ చేస్తడా..? పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Patlolla Karthik Reddy | వేలాది మంది కుటుంబాలు, లక్షలాది మంది ఆధారపడిన జియాగూడ మార్కెట్‌ను బంద్ చేస్తరా..? మీకేమన్నా బుద్దీ జ్ఞానం ఉన్నదా.. మీరు రాష్ట్రం నడుపుతున్నరా..? కామెడీ షో నడుపుతున్నరా..? అని పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ప్రశ్నించారు.
Patlolla Karthik Reddy | జియాగూడ మేకల మండిని జీహెచ్ఎంసీ అధికారులు మూసివేయించడాన్ని నిరసిస్తూ బాధితులు చేపట్టిన ఆందోళనకు బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోజు పని లేకపోతే రోజే గడవదు మనకు. చాలా మంది ఇక్కడ రోజు కూలీలున్నరు. పనే నడవకపోతే ఇల్లే నడవలేని పరిస్థితిలో చాలా మంది ఉన్నరు. ఇవేవి ఆలోచన చేయకుండా మన జియాగూడ మార్కెట్ (మేకల మండి)ని బంద్ చేసిర్రో.. అందుకు నిరసనగా తరలివచ్చిన
అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
ముఖ్యమంత్రికి ఏం ఆలోచన వచ్చింది.. ఈ మూసీని ఏదన్నా ఒకటి చేయాలే. దీని వల్ల మనకు మంచిగైతదని కాదు.. ఆయనకు పేరొస్తది.. మూసీని మంచిగ చేస్తే ఏదో రాజకీయంగా లబ్ధి కావాలే.. దీని వల్ల వేలాది జీవితాలు నాశనమైపోయినా ఫర్వాలేదనే ఆలోచన ముఖ్యమంత్రికి వచ్చింది కాబట్టి ఎప్పుడూ మన జియాగూడ మార్కెట్లో కనిపించని, కలువని కలుషితం ఇప్పుడు అధికారులకు కనిపిస్తుందట. నెలకు రూ.200 కోట్ల వ్యాపారం నడుస్తున్న మార్కెట్‌ను బంద్ చేస్తడా..? బుద్ధున్న గాడిది గాడు ఎవడైనా . ఇలాంటి పనులు చేస్తరు కాబట్టే ప్రభుత్వం దగ్గర పైసలు వస్తలేవు. వేలాది మంది కుటుంబాలు, లక్షలాది మంది ఆధారపడిన మార్కెట్‌ను బంద్ చేస్తరా..? మీకేమన్నా బుద్దీ జ్ఞానం ఉన్నదా.. మీరు రాష్ట్రం నడుపుతున్నరా..? కామెడీ షో నడుపుతున్నరా..? అని ప్రశ్నించారు.
ఆదివారం లోపు జియాగూడా స్లాటర్ హౌజ్ మార్కెట్ తెరవకపోతే ఉద్యమం తారా స్థాయికి తీసుకెళ్తాము అంటూ జీహెచ్ఎంసీ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది కుటుంబాలను రోడ్డున పడేసే ఈ పిచ్చి పనులు ఏంటి..? 1930 నిజాం కాలం నుండి ఇక్కడ స్లాటర్ హౌస్ నడుస్తున్నది. నీకు చిత్తశుద్ధి ఉంటే వేరే చోట మార్కెట్ కట్టించి ఇక్కడ ఖాళీ చేయించు.. అని హెచ్చరించారు. ఈ ఆదివారం లోపు మార్కెట్ ఓపెన్ చేయకపోతే సోమవారం GHMC ఆఫీస్ ముందు యాటలు కటింగ్ చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
200 కోట్ల వ్యాపారం చేసే మార్కెట్ ఎవడన్నా బంజేస్తారా? బుర్రల పెండ ఉన్నదా?
నువ్వు ప్రభుత్వం నడుపుతున్నావా, కామెడీ షో నడుపుతున్నావా రేవంత్ రెడ్డి
ఆదివారం లోపు జియాగూడా స్లాటర్ హౌజ్ మార్కెట్ తెరవకపోతే ఉద్యమం తారా స్థాయికి తీసుకెళ్తాము అంటూ జీహెచ్ఎంసీ అధికారులపై తీవ్ర ఆగ్రహం… pic.twitter.com/NipcNxbggW
— Telugu Scribe (@TeluguScribe) April 7, 2026
Read Also :
Reservoirs | తెలంగాణలో తీవ్ర నీటి సంక్షోభం.. డెడ్ స్టోరేజ్ దిశగా తెలంగాణ జలాశయాలు
Anant Ambani | ఆధ్యాత్మిక సేవలో అంబానీ వారసుడు.. గురువాయూర్, రాజరాజేశ్వరం ఆలయాలకు రూ.18 కోట్ల సాయం!
New Shayampet | కాలుష్య కోరల్లో చెరవులు..పట్టించుకోని అధికారులు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్‌కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

