సర్కార్ దవాఖానల్లో దాహం.. దాహం
నగరంలోని సర్కార్ దవాఖానల్లో తాగునీరు లేక రోగులు, వారి సహాయకులు దాహంతో తల్లడిల్లిపోతున్నారు. అధికారులు పర్యవేక్షణ లోపం, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా వైద్యశాలల్లో నీటి ట్యాంకులు మరమ్మతులకు నోచుకోకపోవడం, అపరిశుభ్రతతో అవి శిథిలావస్థకు చేరుకున్నాయి.
సిటీబ్యూరో: నగరంలోని సర్కార్ దవాఖానల్లో తాగునీరు లేక రోగులు, వారి సహాయకులు దాహంతో తల్లడిల్లిపోతున్నారు. అధికారులు పర్యవేక్షణ లోపం, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా వైద్యశాలల్లో నీటి ట్యాంకులు మరమ్మతులకు నోచుకోకపోవడం, అపరిశుభ్రతతో అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో రోగులకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. ముఖ్యంగా ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఎంఎన్జే క్యాన్సర్ వైద్యశాలల్లో నీటి సౌకర్యాలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. స్వచ్ఛం ద సంస్థలు ఏర్పాటు చేసిన నీటి కూలర్లు సరైన నిర్వహణ లేక దెబ్బతిన్నాయి.
ఉన్నవి కూడా అపరిశుభ్రంగా ఉంటున్నది. దీంతో తాగునీటి కోసం స్థానికంగా ఉన్న క్యాంటీన్లు, హోటళ్లపైనే ఆధారపడాల్సి వస్తున్నదని రోగుల సహాయకులు వాపోతున్నారు. ఉస్మానియా, నిలోఫర్ తదితర దవాఖానల్లో కొందరు సిబ్బంది స్థానికంగా ఉన్న నీటి వ్యాపారులు, క్యాంటీన్ నిర్వాహకులతో చేతులు కలిపి.. నీటి వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వైద్యశాల సి బ్బందే స్వయంగా ఆయా దవాఖానల్లో నీటి వసతి లేకుండా కృత్రిమ సమస్య సృష్టిస్తున్నట్లు సమాచారం. దీంతో తాగునీరు లేక.. రోగులు అక్కడున్న క్యాంటీన్లు, ఇతర నీటి వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

