Lasya Nanditha | సంగారెడ్డి : రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందిన ఘటన తమ పోలీసు స్టేషన్ పరిధిలోనే జరిగిందని పటాన్చెరు పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు. తలకు బలమైన గాయం, ఇంటర్నల్ బ్లీడింగ్ వల్ల లాస్య నందిత చనిపోయినట్లు పోస్టుమార్టం చేసిన డాక్టర్లు పేర్కొన్నారు. పోస్టుమార్టం నివేదిక తమ వద్దకు వచ్చేందుకు సమయం పడుతుందన్నారు. అయితే సుల్తాన్పూర్ వద్ద ముందు వెళ్తున్న టిప్పర్‌ను లాస్య నందిత వెళ్తున్న కారు ఢీకొట్టింది. దీంతో కారు అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.