సుల్తాన్‌బజార్,సెప్టెంబర్ 14. ఎస్సీ వర్గీకరణపై ఉత్తమ్‌కుమార్ రెడ్డి కమిటీని రద్దు చేయాలని మాల మహానాడు జాతీయ అధ్య క్షుడు డాక్టర్ పసుల రాంమూర్తి కోరారు. శనివారం ఢిల్లీ అక్బర్ రోడ్డులోని ఏఐసీసీ కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అసంఘటిత ఉద్యోగ జాతీయ చైర్మన్ డాక్టర్ ఉదిత్ రాజ్‌ను మాల మహానాడు ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు జూపాక సుధీర్‌తో కలిసి ఆయనను కలిసి వినతి పత్రం అందజేశారు.
ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పును రద్దు చేయించాలని అన్నారు. దేశంలోని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోని నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకోవడం సరైన పద్ధతి కాదని అన్నారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి కమిటీని వెంటనే ర ద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి దీపదాస్కు వినతి పత్రాన్ని పంపాలని ఉదిత్‌రాజ్‌ను ఆయన కోరారు. జాతీయ యువజన ప్రధాన కార్యదర్శి మగ్గిడి దీపక్, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షు రాలు ఆరె దేవకర్ణ,రాష్ట్ర మహిళా కార్యదర్శి గంట బబిత తదితరులు పాల్గొన్నారు.
రవీంద్రభారతి,సెప్టెంబర్14: ఎస్సీ వర్గీకరణకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన మంత్రుల కమిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ దళిత బహుజన పార్టీ డీబీపీ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణస్వరూప్, మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వీఎల్ రాజు ఆధ్వర్యంలో శనివారం ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను, వర్గీకరణ ప్రతులను, పీఎం నరేంద్రమోదీ చిత్ర పటాన్ని దహనం చేశారు. ఈ సందర్భంగా కృష్ణస్వరూప్ మాట్లాడుతూ వర్గీకరణ కమిటీని వెంటనే రద్దు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్, పీఎం నరేంద్రమోదీ డౌన్..డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గవ్వల శ్రీకాంత్, రోజాలీలా, భూలపల్లి హేమలత తదితరులు పాల్గొన్నారు.