హైదరాబాద్ : షిరిడీ నుంచి హైదరాబాద్ వస్తున్న టీఎస్ఆర్టీసీ బస్సులో(RTC bus) ప్రయాణికుల బ్యాగులు(Passenger bags) చోరీకి9Stolen) గురయ్యాయి. తుల్జాపుర్(Tuljapur) పెట్రోల్ బంక్ వద్ద బస్సు ఆగడంతో లగేజీ స్టోర్ తాళం పలగొట్టిన దుండగులు బ్యాగులు ఎత్తుకెళ్లారు. బ్యాగులు లేకపోవడంతో ఆందోళన చెందిన ప్రయాణికులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా అదే పెట్రోల్ బంక్ వద్ద వేరే బస్సులో దొంగలు చోరీకి పాల్పడటం గమనార్హం. ఇప్పటికైనా పోలీసులు నిఘా పెంచి ప్రయాణికులకు భద్రత కల్పించాలని కోరుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.