కేపీహెచ్‌బీ కాలనీ: జీహెచ్ఎంసీ పార్కు స్థలాన్ని కజ్జాకు యత్నిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, పార్కు స్థలం అన్యాక్రాంతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు. బుధవారం వసంతనగర్ డివిజన్లోని శిల్పా ఎవెన్యూ కాలనీలో నందనవనం పార్కును ప్రైవేట్ వ్యక్తులు కజ్జాకు యత్నిస్తున్నారని స్థానికుల ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే కృష్ణారావు, మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్‌రావు పరిశీలించారు.
అనంతరం సీఎంసీ కమిషనర్ సృజనకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శిల్పా ఎవెన్యూ కాలనీలోని పార్కు స్థలాన్ని గతంలో కొందరు వ్యక్తులు కజ్జాకు యత్నిస్తే అడ్డుకుని, ఆ స్థలాన్ని కాపాడి చూట్టు గోడను నిర్మించి పార్కుగా తీర్చిదిద్ది ప్రజలకు అప్పగించినట్లు తెలిపారు. నేడు మళ్లీ కొందరు ప్రైవేట్ వ్యక్తులు దర్జాగా కజ్జాకు పాల్పడుతున్నా… జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.