Murder | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. బండ్లగూడ పరిధిలోని గౌస్ నగర్లో ఓ పాన్ షాపు ఓనర్ను గుర్తు తెలియని దుండగులు బుధవారం రాత్రి అతి కిరాతకంగా హత్య చేశారు.
మోషిన్ అనే యువకుడు గౌస్ నగర్లో హెచ్కేజీఎస్ పేరిట పాన్ షాపు నిర్వహిస్తున్నాడు. అయితే బుధవారం రాత్రి ఓ ముగ్గురు వ్యక్తులు షాప్ వద్దకు వచ్చారు. ఇక కత్తులు బయటకు తీసి మోషిన్పై విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతూ మోషిన్ ప్రాణాలు కోల్పోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆ ఏరియాను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. మోషిన్ కుటుంబ సభ్యులు, అతని స్నేహితుల నుంచి పోలీసులు వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది.