ఖైరతాబాద్, ఏప్రిల్ 27 : ప్రకృతి ప్రేమికుడు, దివంగత పద్మశ్రీ డాక్టర్ వనజీవి రామయ్య ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని వక్తలు పిలుపునిచ్చారు. తెలంగాణ కుమ్మర శాలివాహన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సంస్మరణ సభలో సంఘం అధ్యక్షుడు డాక్టర్ రవిశంకర్ మాట్లాడుతూ వనజీవి రామయ్య జీవితం ఎంతో ఆదర్శవంతమైందన్నారు. ఆయన ఆశయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ట్యాంక్‌బండ్‌పై రామయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, ఖమ్మం జిల్లాలోని విశ్వవిద్యాలయానికి ఆయన నామకరణం చేయాలన్నారు. జూన్ 1న వనజీవి రామయ్య జయంతిని నిర్వహించాలని, పాఠ్యపుస్తకాల్లో ఆయన జీవిత చరిత్రను చేర్చాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వనజీవికి భారతరత్న ఇచ్చే విధంగా కేంద్రానికి సిఫారసు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సమాజ్ అధ్యక్షుడు సంగెం సూర్యారావు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, సంఘం గౌరవ అధ్యక్షులు కె. దశరథ్, ప్రధాన కార్యదర్శి కె. లక్ష్మినారాయణ, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, శ్యామ్ కుమార్, కోశాధికారి నిమ్మలూరు శ్రీనివాస్, బాలకృష్ణ, సిల్వేరు వెంకటేశ్, రేపాక రాంబాబు, వీరన్న , చంద్రశేఖర్, బాలామణి, శివానీ, తదితరులు పాల్గొన్నారు.