సికింద్రాబాద్, ఏప్రిల్ 17 : ఎల్కతుర్తి లో జరిగే రజతోత్సవ సభకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సర్వ సభ్య సమావేశం గురువారం సీ తాఫల్ మండి లో జరిగింది. పద్మారావు గౌడ్ మాట్లాడుతూ.. 27న ఉదయం 10.00 గంటలకు అన్ని డివిజన్లలో తోరణాలు, జెండాలతో అత్యంత సుందరంగా అలంకరణ చేసి జెండాలను ఆవిష్కరించాలని కోరారు. ఎల్కతుర్తిలో జరిగే పార్టీ రజతోత్సవ సభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని పద్మారావు గౌడ్ పిలుపునిచ్చారు.
10 లక్షల మందితో ఎల్కతుర్తి సభను బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం నిర్వహిస్తోందని, సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కూడా భారీగా కార్యకర్తలు, జనం తరలి వెళ్లాలన్నారు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలన్నారు. కార్పొరేటర్లు శైలజ, ప్రసన్న లక్ష్మీ శ్రీనివాస్, హేమ, సునీత , నేతలు ఆలకుంట హరి తదితరులు పాల్గొన్నారు.