Kukatpally | కేపీహెచ్‌బీ కాలనీ, మార్చి 28: కూకట్పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పి.గోవర్ధన్ రెడ్డి మూడోసారి భారీ మెజార్టీతో హ్యాట్రిక్ విజయం సాధించారు. గురువారం కూకట్పల్లి కోర్టు కాంప్లెక్స్ లో జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికల్లో పి.గోవర్ధన్ రెడ్డి సమీప ప్రత్యర్థి శ్రీనివాస్ రెడ్డి పై 96 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా కే. భీమయ్య, ప్రధాన కార్యదర్శిగా ఎ.సుదర్శన్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా ఎస్. హర్షవర్ధన్ రెడ్డి, కోశాధికారిగా సైఫుల్ల షరీఫ్, లైబ్రరీ సెక్రటరీగా ఎం. లావణ్య, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా కే.సురేష్, మహిళా సెక్రటరీగా బీవీఎన్ఎల్ లత, కమిటీ సభ్యులుగా జే. అఖిలరావు, తన్నీరు శ్రీకాంత్, బి. అర్చన గౌడ్, జె.భాను ప్రసాద్, జె.కళ్యాణి, ఏం.పద్మావతి, యు.రామకృష్ణ లు విజయం సాధించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ… ఏడాది పదవీకాలంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని అన్నారు. న్యాయవాదుల సంక్షేమానికి పాటు పడతామని, కోర్టు కాంప్లెక్స్‌లో సదుపాయాల కల్పన కృషి చేస్తామని తెలిపారు. నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన న్యాయవాదులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.