ఔటర్ రహదారుల వెంట ఆహ్లాదపరుస్తున్న ఆకుపచ్చని అందాలు 158 కిలోమీటర్ల పొడవునా హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు ఎన్నో ఆకర్షణలకు వేదికగా నిలుస్తున్నది. రింగురోడ్డు చుట్టూ ఉన్న 19 ఇంటర్ చేంజ్‌లతో పాటు రోడ్డు మధ్యలో, ఇరువైపులా అందమైన పూలమొక్కలు, ల్యాండ్ స్కేప్లతో ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. కనువిందు చేసే ఇలాంటి ఫొటోలను పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ,హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ ట్విట్టర్లో పెట్టారు. ఎప్పుడు ప్రయాణం చేసినా ఔటర్ సరికొత్త అనుభూతిని మిగులుస్తుందని ట్వీట్లో అభివర్ణించారు.