పోలింగ్‌ను నిశితంగా పరిశీలించాలి
ఎన్నికల్లో కీలకమైన ఓటింగ్ ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ మైక్రో అబ్జర్వర్లకు సూచించారు. సోమవారం బంజారాహిల్స్‌లోని కొమరం భీం ఆదివాసి భవన్లో మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు.
- ఎన్నికల్లో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం
- శిక్షణ తరగతుల్లో ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్
సిటీబ్యూరో, మే 6, (నమస్తే తెలంగాణ) : ఎన్నికల్లో కీలకమైన ఓటింగ్ ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ మైక్రో అబ్జర్వర్లకు సూచించారు. సోమవారం బంజారాహిల్స్‌లోని కొమరం భీం ఆదివాసి భవన్లో మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎన్నికల సంఘం నిబంధనలను తూ.చ. తప్పకుండా అమలయ్యేలా, ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికల ప్రక్రియ జరిగేలా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని ఎన్నికల అధికారి హితవు పలికారు. మైక్రో అబ్జర్వర్లు పోలింగ్‌కు సంబంధించిన ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన ఏర్పర్చుకోవాలని, అప్పుడే పోలింగ్ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించగలుగుతారని పేర్కొన్నారు. ముఖ్యంగా పోలింగ్‌కు ముందు రోజు ఉదయం నిర్ణీత సమయంలోగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌కు చేరుకొని, పోలింగ్ సిబ్బందికి అందించే సామగ్రి సక్రమంగా అందిందా? లేదా.. అన్నది పరిశీలించాలని, అనంతరం పోలింగ్ సిబ్బందితో కలిసి పోలింగ్ స్టేషన్లకు చేరుకోవాలని సూచించారు.
ఉదయం 5.30 గంటలకే మాక్ పోల్
మైక్రో అబ్జర్వర్ల పాత్ర ప్రతి దశలో నిర్ణయాత్మకంగా ఉంటుందని, నిబంధనలకు అనుగుణంగా మాక్ పోలింగ్ జరగాలని, పోలింగ్ రోజు ఏజెంట్ల సమక్షంలో ఉదయం 5.30 గంటలకే మాక్ పోల్ ప్రక్రియ జరిగేలా చూడాలని రోనాల్డ్ రాస్ సూచించారు. ఒకవేళ ఏజెంట్లు ఎవరూ హాజరు కాని పక్షంలో 15 నిమిషాలు వేచి చూసిన తర్వాత మైక్రో అబ్జర్వర్ల సమక్షంలో మాక్ పోల్ నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఉదయం పోలింగ్ ప్రారంభం నుంచి సాయంత్రం పోలింగ్ పూర్తయి.. సీల్ అయ్యేంత వరకు జరిగిన వివరాల నివేదికను జనరల్ అబ్జర్వర్‌కు అందించాలని సూచించారు. ఓటింగ్ గోప్యతను కాపాడే విధంగా మైక్రో అబ్జర్వర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
ఎన్నికల్లో అబ్జర్వర్ల పాత్ర కీలకం: శ్రీవిద్య
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం జనరల్ అబ్జర్వర్ పీఐ శ్రీవిద్య మాట్లాడుతూ.. ఎన్నికల్లో అబ్జర్వర్ల పాత్ర కీలకమైనదని అన్నారు. మైక్రో అబ్జర్వర్లకు పలు సూచనలు చేశారు. మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎలాంటి సంఘటనలు జరిగినా, తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఓటింగ్ గోప్యతను కాపాడే విధంగా మైక్రో అబ్జర్వర్లు పనిచేయాలని సూచించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని శ్రీవిద్య అన్నారు. ఆనంతరం ఈవీఎం, వీవీ ప్యాట్ల నిర్వహణపై మైక్రో అబ్జర్వర్లకు హ్యాండ్ ఆన్ శిక్షణ ఇచ్చారు. శిక్షణ తరగతుల్లో మైక్రో అబ్జర్వర్లు, జిల్లా ఎన్నికల ట్రైనింగ్ నోడల్ అధికారి అడిషనల్ కమిషనర్ సునంద , ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

