ఉస్మానియా యూనివర్సిటీ: సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతించాలంటూ ఉస్మానియా యూనివర్సిటీలో (Osmania University) పీజీ విద్యార్థులు రోడ్డుపై రాస్తారోకోకు దిగారు దిగారు. 75 శాతం హాజరు లేదంటూ పరీక్ష ఫీజు ఉన్న సైతం స్వీకరించడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పరీక్ష ఫీజును స్వీకరించి, పరీక్షలకు రాసేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలంటూ నినదించారు. అధికారుల మూర్ఖత్వపు నిర్ణయాలతో విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీ హాస్టల్లో మౌలిక వసతులు సరిగా లేకపోయినా దానిని పట్టించుకోని అధికారులు హాజరు శాతం నిబంధనను మాత్రం నిక్కచ్చిగా అమలు చేస్తున్నారని మండిపడ్డారు.
విద్యార్థులకు స్టడీ మెటీరియల్..
తుర్కయంజాల్, ఫిబ్రవరి 5: తాను పనిచేస్తున్న స్కూల్లో విద్యార్థులకు సొంత ఖర్చులతో స్టడీ మెటీరియల్ పంపిణీ చేశాడో ఉపాధ్యాయుడు. విజయ్ కుమార్.. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కోహెడ ప్రభుత్వ పాఠశాలలో సోషల్ టీచర్‌గా పనిచేస్తున్నారు. బోర్డ్ ఎగ్జామ్స్ సమీపిస్తుండటంతో విద్యార్థులకు తన సొంత డబ్బుతో స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించాలనే ఉద్దేశ్యంతో వారికి సహాయం చేశానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు దన్నే రాజు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.