OU Law College | ఉస్మానియా యూనివర్సిటీ : ఇటీవల నిర్వహించిన అంతర్ కళాశాలల పోటీలో ప్రతిభ కనబరిచి బహుమతులు సాధించిన ఉస్మానియా యూనివర్సిటీ లా కళాశాల విద్యార్థులను వర్సిటీ ఉన్నతాధికారులు గురువారం అభినందించారు. సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, బ్యూరో పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంయుక్తంగా నూతన నేర చట్టాలపై వీడియో రూపొందించే అంతర్ కళాశాల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో ఓయూ లా కలాశాల విద్యార్థులు ఏడు బహుమతులు సాధించారు. దానితోపాటు ఉత్తమ కళాశాల అవార్డును ఓయూ లా కళాశాల సాధించింది. ఈ కార్యక్రమంలో వీసీ ప్రొఫెసర్ కుమార్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేష్ రెడ్డి, ఓ ఎస్ డి ప్రొఫెసర్ జితేందర్ నాయక్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ రాంప్రసాద్ పాల్గొన్నారు.