వివిధ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు
ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
బీసీఏ ఆరో సెమిస్టర్ మేకప్ పరీక్షలను ఈ నెల 8వ తేదీ నుంచి, ఎంఏఎం (ఐదేళ్ల డ్యుయల్ డిగ్రీ కోర్సు), ఎంబీఏ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు రెండు, నాలుగు, ఆరు, ఎనిమిది, పదో సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలను ఈ నెల 16వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ http://www.osmania. ac.in చూసుకోవచ్చని సూచించారు.
బీసీఏ పరీక్షా ఫలితాల విడుదల
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీసీఏ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
బీసీఏ (నాన్ సీబీసీఎస్), బీసీఏ (సీబీసీఎస్) పరీక్షల ఫలితాలను ఓయూ వెబ్సైట్ http://www.osmania.ac.in అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.
వివిధ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఏఎం (డ్యుయల్ డిగ్రీ కోర్స్ ఇన్ మేనేజ్మెంట్), ఐదేళ్ల ఎంబీఏ కోర్సుల మొదటి, మూడు, అయిదు, ఏడు, తొమ్మిదో సెమిస్టర్ బ్యాక్లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్షా ఫీజును ఈ నెల 25వ తేదీ వరకు సంబంధిత కళాశాలల్లో చెల్లించవచ్చని చెప్పారు.
రూ.300 అపరాధ రుసుముతో వచ్చే నెల 3వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ http://www.osmania.ac.in చూసుకోవచ్చని సూచించారు.
వివిధ కోర్సుల రివాల్యుయేషన్‌కు దరఖాస్తుల ఆహ్వానం
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల రివాల్యుయేషన్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఎంసీఏ (సీబీసీఎస్) మొదటి సెమిస్టర్ మెయిన్, బ్యాక్‌లాగ్‌తో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కలినరీ ఆర్ట్ (పీజీడీసీఏ) మెయిన్ పరీక్షల ఫలితాలను ఇప్పటికే విడుదల చేశామని చెప్పారు. అభ్యర్థులు తమ మార్కు మెమోలను సంబంధిత కళాశాల నుంచి మూడు వారాల తరువాత పొందవచ్చని పేర్కొన్నారు.
రివాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోదలిచిన వారు ఒక్కో పేపర్‌కు రూ.500 చొప్పున చెల్లించి ఈ నెల 6వ తేదీలోగా టీఎస్ ఆన్లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. రూ.200 అపరాధ రుసుముతో ఈ నెల 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
జవాబు పత్రం నకలు పొందగోరేవారు ఒక్కో పేపర్‌కు రూ.1000 చొప్పున చెల్లించి ఈ నెల 8వ తేదీలోగా తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ http://www.osmania.ac.in చూసుకోవచ్చని సూచించారు.