సిటీబ్యూరో: ఓఆర్ఆర్ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు పరిహారంగా అప్పట్లో హెచ్ఎండీఏ సమీపంలోనే భూ సేకరణ చేసి.. ప్లాట్ల అభివృద్ధి కోసం పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించి చేతులు దులుపుకొన్నది. రైతులు, నిర్మాణదారులకు ఘట్కేసర్ సమీపంలోని కొండాపూర్ వద్ద 100 ఎకరాల విస్తీర్ణంలో భూములను కేటాయించి, ప్లాట్లుగా అప్పగించారు.
కాంట్రాక్టర్ మౌలిక వసతులు కల్పించలేదు. సుమారు 15 ఏండ్ల తర్వాత హెచ్ఎండీఏ అధికారులు సదరు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోకుండా.. తమను వేధింపులకు గురిచేస్తున్నారంటూ..హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయానికి బాధితులు చేరుకున్నారు. కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో నిరసన వ్యక్తం చేసిన అనంతరం వినతిపత్రాన్ని అధికారులకు అందజేసినట్లు ఘట్కేసర్ ఓఆర్ఆర్ బాధితుల సంఘం సభ్యులు పేర్కొన్నారు.