KTR : శంషాబాద్ సమీపంలో ఓఆర్ఆర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కోడం శ్వేతను కిమ్స్‌కు తరలించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆదేశాలతో ఆమెకు గచ్చిబౌలిలోని కిమ్స్‌లో మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం కిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్న శ్వేత ఆరోగ్యం కాస్త నిలకడగా ఉందని సమాచారం.
శంషాబాద్ ఓఆర్ఆర్ వద్ద శుక్రవారం ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు సిరిసిల్ల వాసులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో శ్వేత తీవ్రంగా గాయపడింది. యాక్సిడెంట్లో ఆరుగురు దుర్మరణం చెందడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేటీఆర్.. గాయాలపాలైన శ్వేతకు మెరుగైన వైద్యం అందించడానికి కిమ్స్‌కు తరలించాలని తన సిబ్బందిని ఆదేశించారు. దాంతో, కేటిఆర్ సిబ్బంది మేరకు శ్వేతను శంషాబాద్ ఆసుపత్రి నుంచి కిమ్స్ గచ్చిబౌలికి తీసుకెళ్లారు.

శుక్రవారం ఉదయం యాదాద్రికి వెళ్లి ఓఆర్ఆర్పై నుంచి వస్తుండగా ఆగి ఉన్న లారీని అతివేగంగా వచ్చి ఢీ కొనడంతో ఆరుగురు మృతి చెందారు. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఓఆర్ఆర్ ఎగ్జిజ్ గేట్-16 వద్ద ఆగిఉన్న లారీనీ వెనుక నుంచి వచ్చిన టీఎస్ 23 ఎఫ్ 2298 అనే నంబర్ గల కారు ఢీకొట్టింది .
కొనఊపిరితో ఉన్న వ్యక్తిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. లారీ వెనుక భాగంలో చిక్కుకున్న కారును క్రేన్ సహాయంతో బయటకు తీశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. మృతుల్లో వ్యక్తి , ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు న్నారు. మృతులు శ్రీనివాస్, శివ, కృష్ణచంద్ర, మాధవ్, రిషిక , మరొకరి పేరు తెలియాల్సి ఉంది. తీవ్రంగా గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ పరిశీలించారు.