సైబర్ బాధితులకు నగదు రీఫండ్‌కు ఆదేశాలు
సైబర్ నేరాల బాధితులకు సత్వర న్యాయం అందించడంలో సైబరాబాద్ పోలీసులు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ నెల 20న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన 2,232 సైబర్ నేరాలకు సంబంధించిన కేసుల్లో బాధితులకు అనుకూలంగా కోర్టుల నుంచి రీఫం డ్ ఆదేశాలు పొందడంలో విజయాన్ని సాధించారు.
- పోలీసులను అభినందించిన శిఖా గోయల్
సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరాల బాధితులకు సత్వర న్యాయం అందించడంలో సైబరాబాద్ పోలీసులు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ నెల 20న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన 2,232 సైబర్ నేరాలకు సంబంధించిన కేసుల్లో బాధితులకు అనుకూలంగా కోర్టుల నుంచి రీఫం డ్ ఆదేశాలు పొందడంలో విజయాన్ని సాధించారు.
ఈ ఆదేశాల ద్వారా మొత్తం రూ.21.90 కోట్ల నగదు బాధితులకు తిరిగి అందేలా మార్గం సుగమమైంది. వివరాల్లోకి వెళితే… సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 24 పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను లోక్ అదాలత్‌లో ప్రవేశపెట్టి బాధితుల తరఫున రీఫండ్ పిటిషన్లు దాఖలు చేయగా, న్యాయస్థానాలు సానుకూలంగా స్పందించాయి. కోర్టుల ఆదేశాల మేరకు అవసరమైన ప్రక్రియ పూర్తయిన అనంతరం సంబంధిత బ్యాంకులు బాధితుల ఖాతాల్లో నగదును జమ చేసేందుకు అంగీకరించాయి.
పోలీసులకు శిఖా గోయల్ ప్రశంసలు
ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్‌తో పాటు ఈ ప్రక్రియలో పాల్గొన్న పోలీసు సిబ్బందిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) డైరెక్టర్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖాగోయల్ ప్రత్యేకంగా అభినందించారు. సైబర్ నేరాల బాధితులకు ఆర్థిక ఉపశమనం కల్పించడంలో సైబరాబాద్ పోలీసుల సేవలు ఆదర్శప్రాయమన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
women cops detain Dipke | అభిజిత్ దీప్కే బృందాన్ని అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. వారినే ఎందుకు మోహరించారంటే?
గోల్డ్ మెడల్స్ సాధించిన మేఘన కాంతిప్రియకు సన్మానం
William O’Rourke | న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ.. భారత్‌తో వన్డే, టెస్టులకు స్టార్ పేసర్ దూరం..!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

