జిల్లా వెనుకంజ
హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీతోపాటు డిజిటలైజేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. ప్రజల నుంచి సేకరించి, పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను ఆలస్యం చేయకుండా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీఈవో సుదర్శన్ రెడ్డి ఆదేశించారు.
- సర్ ఫారాల డిజిటలైజేషన్లో 3.40 శాతం మాత్రమే పూర్తి
సిటీబ్యూరో, జూలై 7 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీతోపాటు డిజిటలైజేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. ప్రజల నుంచి సేకరించి, పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను ఆలస్యం చేయకుండా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీఈవో సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. అయితే క్షేత్రస్థాయిలో ఆ ఆదేశాలు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు.
జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చాంద్రాయణగుట్ట 6.56శాతం, నాంపల్లి 6.17శాతం మినహా మిగిలిన 13 నియోజకవర్గాల్లో డిజిటలైజేషన్ ఊపందుకోలేదు. ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లకపోవడం, ఫారాలను ఓటర్ల నుంచి తీసుకోవడంలో జాప్యం చేస్తుండడం, చేతిలో ఉన్న ఫారాలను డిజిటలైజేషన్ చేయడంలో అడుగడుగునా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఆన్లైన్ ద్వారా వచ్చే ఎన్యూమరేషన్ ఫారాలను సైతం క్షుణ్ణంగా పరిశీలించి ఓటరు జాబితాను తప్పుల్లేకుండా రూపొందించాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండడం గమనార్హం.

Hyd2
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

