కాచిగూడ,ఆగస్టు 8: నేషనల్ సెంటర్ ఫైర్,సేఫ్టీ, ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ఫైర్,సేఫ్టీ కోర్సులకు అర్హత, ఆసక్తి గల అభ్యర్థుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ అడపా వెంకట్రెడ్డి తెలిపారు. శుక్రవారం కాచిగూడలో విలేకరులతో ఆయన మాట్లాడారు.
ఈ శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు పేరొందిన ఎయిర్పోర్ట్, అయిల్ కంపెనీలు, గ్యాస్ ఇండస్ట్రీస్, స్టార్ హోటల్స్, ఫార్మా ఇండస్ట్రీస్, రైల్వే, వివిధ కార్పొరేట్ సంస్థలలో అవకాశాలు పొందవచ్చని వెల్లడించారు. ఈ కోర్సులలో చేరేందుకు ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల యువకులు ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు www.ncttindia.com. లేదా 6302355872లో సంప్రదించాలని కోరారు.