Hyderabad | జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే!
Hyderabad | హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలోని కేబీఆర్ పార్క్ వద్ద జరుగుతున్న స్టీల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనుల దృష్ట్యా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఉండేందుకు కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వేను అమలు చేయాలని భావిస్తున్నారు.
Hyderabad | హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలోని కేబీఆర్ పార్క్ వద్ద జరుగుతున్న స్టీల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనుల దృష్ట్యా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఉండేందుకు కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వేను అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ట్రయల్ రన్ నిర్వహించారు.
పంజాగుట్ట నుంచి మాదాపూర్ వెళ్లే వాహనాలను రోడ్డు నంబర్ 2 నుంచి వన్‌వేగా మళ్లించారు. అంటే టీవీ9 ఆఫీసు నుంచి వచ్చే వాహనాలను కేబీఆర్ పార్క్ వద్ద ఎడమ వైపునకు మళ్లించారు. అక్కడి నుంచి తెలంగాణ భవన్, సీవీఆర్ జంక్షన్, బాలకృష్ణ నివాసం మీదుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, మాదాపూర్ వెళ్లే విధంగా ట్రాఫిక్‌ను డైవర్ట్ చేశారు. ట్రయల్ రన్లో భాగంగా ఇవాళ రెండు గంటల పాటు కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వేను అమలు చేశారు. ఇందులో తలెత్తిన సమస్యలు, లోటుపాట్లను విశ్లేషించిన తర్వాత.. ఈ రూట్లో వన్‌వే అమలు చేయాలా? వద్దా? అనే దానిపై ట్రాఫిక్ అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.
జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే
ఫ్లైఓవర్ నిర్మాణ పనుల నేపధ్యంలో ట్రాఫిక్ జామ్ అవ్వకుండా పోలీసుల చర్యలు
టీవీ9 ఆఫీసు నుండి వచ్చే వాహనాలను కేబీఆర్ పార్క్ వద్ద ఎడమవైపుకు మళ్లిస్తూ, తెలంగాణ భవన్, సీవీఆర్ జంక్షన్, బాలకృష్ణ నివాసం మీదుగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, మాదాపూర్… pic.twitter.com/1QWr5FDgkA
— Telugu Scribe (@TeluguScribe) April 5, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

