హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఫుట్‌పాత్‌పైకి దీసుకెళ్లింది. దీంతో ఓ వ్యక్తి మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ప్రమాదం అనంతరం డ్రైవర్ కారును అక్కడే వదిలేసి పారిపోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. కారు నంబర్ ప్లేట్ ఆధారంగా యజమానిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.