Hyderabad | రాయదుర్గంలో ఎకరం రూ. 204 కోట్లు.. టీజీఐఐసీ భూముల వేలంలో పలికిన ధర!
Hyderabad | భూముల వేలం ద్వారా సర్కారుకు భారీగా ఆదాయం సమకూరుతున్నప్పటికీ అప్పులు చేస్తున్నది. రాబడి లేదు.. ఖర్చులకు పైసల్లేవని ఏకంగా ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క సెలవిచ్చారు.
హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): భూముల వేలం ద్వారా సర్కారుకు భారీగా ఆదాయం సమకూరుతున్నప్పటికీ అప్పులు చేస్తున్నది. రాబడి లేదు.. ఖర్చులకు పైసల్లేవని ఏకంగా ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క సెలవిచ్చారు.
తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషనే లిమిటెడ్(టీజీఐఐసీ) రాయదర్గంలో నిర్వ హించిన భూముల వేలంలో ఎకరం రూ.204కోట్లు ధర పలికింది. సోమవారం రంగారెడ్డి జిల్లా రాయదుర్గంలోని 83/1 సర్వే నంబర్లోని 5.09 ఎకరాల భూమికి టీజీఐఐసీ వేలం నిర్వహించగా, ఎకరం రూ.204కోట్లకు ధర పలుకగా.. 5.09 ఎకరాలకు రూ.1020 కోట్ల ఆదాయం సమకూరినట్టు అధికారులు వెల్లడించారు.
రెండురోజుల క్రితం ఇక్కడ నిర్వహించిన వేలంలో ఎకరం రూ.237 కోట్ల రికార్డు ధర పలికిన విషయం తెలిసిందే. 6.29 ఎకరాల భూమి వేలంగా వేయగా, ప్రభుత్వానికి రూ.1,490 కోట్లు ఆదాయం సమకూరింది. రెండు విడతల్లో కలిపి వేలంలో సుమారు రూ.2,500 కోట్లు ఆదాయం సమకూరింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

