36వ ఒలింపిక్ డేను పురస్కరించుకుని గురువారం చారిత్రక చార్మినార్ వద్ద ఒలింపిక్ రిలే జ్యోతి రన్‌ను నిర్వహించారు. చార్మినార్ నుంచి లాల్‌బహదూర్ స్టేడియం వరకు కొనసాగినట్లు రాష్ట్ర టగ్ ఆఫ్ వార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆదర్ల మహేశ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ చార్మినార్ సెంటర్ కన్వీనర్ ఇమన్యూయేల్, టెన్నికోట్ ప్రధాన కార్యదర్శి యాదయ్య, కార్యదర్శి సలీం, జానకీరాం, బర్కత్ అలీ, జీహెచ్ఎంసీ క్రీడల ఇన్స్పెక్టర్లు రఫీక్, యాదగిరి, దయానంద్, భానుప్రకాశ్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
– చార్మినార్, జూన్ 23
ఒలింపిక్ డే రన్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అబ్కారీ, పర్యాటక, క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ గురువారం హాజరై జాతీయ క్రీడలలో పథకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారులకు ఘనంగా సన్మానం చేశారు.
తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జింఖానా మైదానంలో ట్రిపుల్ ఒలింపియన్ ఎన్.ముఖేష్ కుమార్, కె.విద్యాసాగర్ జ్యోతి వెలిగించి రన్‌ను ప్రారంభించారు. ఒలింపిక్ డే రన్ చార్మినార్, చాదర్‌ఘాట్ విక్టోరియా మెమోరియల్ మైదానం, యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, బోయిన్పల్లి, మెహిదీపట్నం, ఓయూ ఆర్ట్స్ కళాశాల, ఫతే మైదాన్ క్లబ్, వైఎంసీఏ నారాయణగూడ, ఖైరతాబాద్ కేంద్రాల నుంచి గురువారం ఉదయం లాల్‌బహదూర్ ఇండోర్ స్టేడియానికి చేరుకుంది.