జూబ్లీహిల్స్, జూన్ 23: తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ సంయుక్త ఆధ్వర్యంలో 39 వ ఒలింపిక్ డే రన్ నిర్వహించారు. సోమవారం యూసుఫ్ గూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర త్రో బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు వి. నవీన్ యాదవ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
వేగంగా.. ఉన్నతంగా.. బలంగా.. కలిసి కట్టుగా అనే థీమ్ తో నిర్వహించిన ఈ రన్ యువ క్రీడాకారుల్లో ఒలింపిక్ స్ఫూర్తిని రగిలించి సమాజంలో క్రీడా అవగాహనను పెంపొందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు క్రీడా ప్రముఖులతో పాటు విల్లా మేరీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.