సిటీబ్యూరో, సెప్టెంబర్ 7(నమస్తే తెలంగాణ): ఓల్డ్ సిటీ మెట్రో భూసేకరణ ఇప్పటివరకు 62శాతమే పూర్తి కాగా, ఇందులో 550 ఆస్తుల బాధితులకు రూ. 433 కోట్ల నష్టపరిహారం చెల్లించింది. మిగిలిన ఆస్తుల సేకరణ పూర్తి అయితే గానీ నిర్మాణ పనులు ఊపందుకోలేని పరిస్థితి నెలకొని ఉంది. 7.5 కిలోమీటర్ల మేర కారిడార్‌లో ప్రభావిత ఆస్తుల స్వాధీనం, కూల్చివేతలు, రోడ్డు విస్తరణ పనులు సాగుతున్నాయి.
భూ సామర్థ్యం, మట్టి పరీక్షలు, అలైన్మెంట్తోపాటు, సున్నితమైన కట్టడాల పరిరక్షణ వంటి అంశాలకు ప్రాధాన్యతనిచ్చామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. డిఫరెన్షియల్ గ్లోబల్ పొజీషనింగ్ సిస్టం సర్వే వంటి అధునాతన డిజిటల్ టెక్నాలజీతో సర్వే పనులు సాగుతున్నాయన్నారు.
హై ప్రెసిషన్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టంను సర్వే, మ్యాపింగ్‌లో వినియోగిస్తున్నట్లుగా తెలిపారు. సేకరించిన ప్రాంతాల్లో మైల్ స్టోన్లను ఏర్పాటు చేస్తుండగా, మిగిలిన ఆస్తుల సేకరణ పూర్తయితే గానీ మెట్రో పనులు వేగంగా జరిపే పరిస్థితి కనిపించడం లేదు. దీనికి తోడు కేంద్రం కూడా మెట్రో తదుపరి ఫేజ్‌లకు మోకాలడ్డుతున్నట్లు కనపడుతోంది.