హైదరాబాద్: హైదరాబాద్‌లోని (Hyderabad) మాసబ్‌ట్యాంక్ (Masab Tank) వద్ద పెను ప్రమాదం తప్పింది. మాసబ్‌ట్యాంక్ ఎన్ఎండీసీ (NMDC) వద్ద ఓ ఆయిల్ ట్యాంకర్ (Oil Tanker) అదుపుతప్పి బోల్తాపడింది. ట్యాంకర్ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి (Traffic Jam). ట్యాంకర్ నుంచి ఆయిల్ లీకవడంతో రోడ్డుపై పారుతున్నది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్యాంకర్‌ను క్రేన్ సహాయంతో తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు.