శంషాబాద్ మండలంలోని ఘాన్సీమియాగూడలో సంచరిస్తున్నది.. చిరుత పులి కాదు.. అడవి పిల్లి అని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేశారు. మూడు రోజులుగా గ్రామంలో చిరుత సంచరిస్తున్నట్లు వదంతులు రావడంతో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. రెండు బోన్లు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయితే మంగళవారం రాత్రి సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను చూశాక.. అది అడవి పిల్లిగా గుర్తించినట్లు డిప్యూటీ రేంజ్ అధికారి మహ్మద్ అర్షత్ అమ్మీద్ తెలిపారు. ఇక గ్రామస్తులు భయపడాల్సిన అవసరంలేదన్నారు.