సిటీబ్యూరో, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్న ముఠాను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి 15 క్వింటాళ్ల నకిలీ పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ సుధీంద్ర కథనం ప్రకారం… మహ్మద్ షకీల్ బోయిన్‌పల్లిలోని రాజరాజేశ్వరీనగర్‌లో ’సోనీ జింజర్ గార్లిక్ పేస్ట్’ పేరుతో కార్ఖానాను నిర్వహిస్తున్నాడు. ఇందులో మహ్మద్ సమీర్ అన్సారీ మేనేజర్‌గా, ముక్తార్ అసిస్టెంట్ మేనేజర్‌గా, రజింత్కుమార్, సోనుకుమార్, బిర్వల్ షా, ఇనాయత్, మహేశ్‌కుమార్ అందులో వివిధ పనులు చేస్తున్నారు.
పూర్తిగా పాడైన అల్లం, వెల్లుల్లిని మార్కెట్లో తక్కువ ధరకు కొని, కొన్ని సందర్భాల్లో పనికిరాని వాటిని కూడా తెచ్చి పేస్ట్‌గా తయారు చేస్తున్నారు. అందులో యాసిడ్స్ కలిపి, ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి, అందమైన లేబుళ్లతో బయట మార్కెట్లోకి పంపిస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సైదులు బృందం ఈ కార్ఖానాపై దాడి చేసి.. 1500 కిలోల నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్ట్, 55 కిలోల సిట్రిక్ యాసిడ్లతో పాటు రూ. 4.5 లక్షల విలువైన వివిధ రకాల వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు మహ్మద్ షకీల్ అహ్మద్ మినహా మిగతా వారందరినీ అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.