హైదరాబాద్‌కు మరో 40 ఏండ్ల వరకు తాగునీటికి ఢోకా లేదు..
Hyderabad | హైదరాబాద్ నగరవాసులకు రాబోయే 40 సంవత్సరాల పాటు అవసరమైన తాగునీరు అందుబాటులో ఉందని వాటర్ వర్క్స్ ఎండీ దానకిషోర్ తెలిపారు. శుక్రవారం భారత పరిశ్రమల సమాఖ్య
హైదరాబాద్ : హైదరాబాద్ నగరవాసులకు రాబోయే 40 సంవత్సరాల పాటు అవసరమైన తాగునీరు అందుబాటులో ఉందని వాటర్ వర్క్స్ ఎండీ దానకిషోర్ తెలిపారు. శుక్రవారం భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో తెలంగాణ ఇన్ఫ్రా 2022 సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా మెట్రో వాటర్ వర్క్స్ ఎండీ దాన కిషోర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేటు రంగంలో పెట్టుబడులు ఎక్కువగా హైదరాబాద్‌కు వస్తున్నాయన్నారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పూర్తి చేయడంలో భూ సేకరణ పెద్ద సమస్యగా ఉందన్నారు. 2030 నాటికి ప్రపంచంలో పెరుగుతున్న టాప్ 20 నగరాల్లో భారతదేశానికి సంబంధించినవే 17 ఉంటాయని ఆక్స్ఫర్డ్ సంస్థ నివేదికలో తెలిపిందన్నారు. ఇందులో హైదరాబాద్ ఒకటి అన్నారు. హైదరాబాద్ జీడీపీకి 85 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందన్నారు.
సీఐఐ తెలంగాణ ఇన్ ఫ్రా, రియల్ ఎస్టేట్ ప్యానల్ కన్వీనర్ గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. ఇన్ఫ్రా రంగంలో హైదరాబాద్ నగరం ఆదర్శంగా ఉందన్నారు. ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ఉందని, ఔటర్ రింగ్ రోడ్, మెట్రో రైలు, అవసరమైన నీటి సదుపాయం ఉందన్నారు. రోడ్డు వసతి బాగుండటంతో రైళ్లలో కాకుండా రోడ్డు మార్గాన పయనిస్తున్నారని తెలిపారు.
సీఐఐ అధ్యక్షుడు వాగీష్ దీక్షిత్ మాట్లాడుతూ.. ప్రభుత్వం రేరాను ఏర్పాటు చేసి వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐఐ వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- CII
- Drinking Water
- HMWSS
- Hyderabad
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

