బొల్లారం, జనవరి 13: బొల్లారం రాష్ట్రపతి నిలయంలో పుష్పాలు, ఉద్యానవనాల వేడుకగా నిర్వహించే ఉద్యాన్ ఉత్సవ్ వేడుకలు సోమవారం ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ సాగర్ హనుమాన్ సింగ్, ఐపీఓస్ డైరెక్టర్ జనరల్ మేనేజ్ డాక్టర్ ప్రశాంత్, ఫార్మర్స్ వెల్ఫేర్ భరత్ భూషణ్, డిప్యూటీ సెక్రటరీ రాష్ట్రపతి భవన్ జస్బీర్ సింగ్, వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రజాపతి హాజరయ్యా రు.
జనవరి 2న ప్రారంభమైన ఉద్యాన్ ఉత్సవ్ భారతదేశంలోని అద్భుతమైన వృక్షశాస్త్ర వైవిధ్యాన్ని ప్రదర్శించడంతోపాటు విభిన్నమైన పూలు, మొక్కలు, చెట్ల సేకరణను ప్రదర్శించింది. ఈ సందర్భంగా నిలయం అధికారి రజినీ ప్రియ మాట్లాడుతూ.. వార్షిక సంప్రదాయంలో భాగంగా జరిగిన 12 రోజుల ఉద్యాన్ ఉత్సవ్‌లో ఉద్యానవన నిపుణులు, ప్రకృతి ఔత్సాహికులు, సందర్శకులు, పాఠశాలల విద్యార్థులతో కలిపి సుమారు ఒక లక్ష ముఫ్పై వేల మంది సందర్శించినట్లుగా తెలిపారు.
అనంతరం వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులు ఎగ్జిబిటర్లు, వాలంటీర్లు, వివిధ సముహల కళాకారులకు, సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు సర్టిఫికేట్లను ప్రదానం చేశారు. స్కాలర్ గౌడ్ లు, రాష్ట్రపతి నిలయం డీఈఓలు, ఎన్సీసీ వాలంటీర్లు, వైద్య ఆరోగ్య సంరక్షణ సిబ్బంది ఉద్యాన్ ఉత్సవ్‌లో అందించిన సేవలకు నిలయం అధికారిణి రజినీ ప్రియ కృతజ్ఞతలు తెలియజే శారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వినీత కుమారి, ఈరప్ప కుంబార్, మనోజ్ జాన్, నిలయం సిబ్బంది పాల్గొన్నారు.