Ameerpet Fire Accident | అమీర్ పేట్‌లోని మైత్రివనం కేఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని తెలిసిందే. దట్టంగా పొగ కమ్ముకోవడంతో వ్యాపారస్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిప్రమాద సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలార్పుతున్నారు. కాగా ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని పోలీసులు ప్రకటించారు.
అగ్నిప్రమాదంలో సుమారు 20 దుకాణాలు దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదంతో అమీర్‌పేట్-ఎస్ఆర్ నగర్ రూట్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.
ప్రమాదం జరిగిన టాయ్ షాప్ యజమాని మీడియాతో మాట్లాడుతూ.. హర్ష మెస్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ నుంచి మంటలు వచ్చాయి. మంటలను అదుపు చేసేందుకు 20 నిమిషాలు యత్నించామని.. ఈ ప్రమాదంలో సుమారు రూ.2 కోట్ల ఆస్తినష్టం సంభవించినట్టు తెలిపారు. గతంలో హర్ష మెస్‌పై ఫిర్యాదు చేశామని సదరు యజమాని తెలిపారు.
బ్రేకింగ్ న్యూస్
హైదరాబాద్ – మైత్రివనంలో భారీ అగ్ని ప్రమాదం
భారీగా ఎగసిపడుతున్న మంటలు.. దట్టంగా అలుముకున్న పొగ
కమర్షియల్ కాంప్లెక్స్‌లోని హెల్మెట్ షోరూంలో చెలరేగిన మంటలు
మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది pic.twitter.com/cFRoUNmShZ
— Telugu Scribe (@TeluguScribe) June 4, 2026
Ameerpet Fire Accident | అమీర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం.. షాపింగ్ మాల్లో ఎగసిపడుతున్న మంటలు
Chiranjeevi | ‘పెద్ది’ విజయంపై చిరంజీవి ఎమోషనల్ ట్వీట్.. చరణ్ కష్టానికి దక్కిన ప్రతిఫలం ఇది..
‘వార్డు సభల్లో ప్రజలు భాగస్వాములు కావాలి’