vikiti srihari | కొండా సురేఖ మంత్రి కూతురు కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన ఘాటు విమర్శలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యల వల్ల పక్క పార్టీ వాళ్లు మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు మండిపడుతుండగా.. మరోవైపు
కొండా సురేఖపై వేటు వేయాలని మెజారిటీ ఎమ్మెల్యేల పట్టు పడుతున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. కాగా ఈ క్రమంలో ఏఐసీసీ పరిశీలకురాలు, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగినట్టు కూడా తెలుస్తోంది.
తాజాగా కొండా సురేఖ వివాదంపై మంత్రి వాకిటి శ్రీహరి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాయి. పార్టీకి డ్యామేజీ కానంత వరకే కొండా సురేఖ అయినా, చిన్నారెడ్డి అయినా కొండా సురేఖ మీద కుట్ర చేయాల్సిన అవసరం ఎవరికీ లేదని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. పెద్దరికం చేసేటప్పుడు ఓపిక ఉండాలి. పార్టీ ఉంటేనే మనం, పార్టీ లేకుంటే ఎవరూ లేరు. పార్టీకి నష్టం జరిగితే పీసీసీ చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.