KTR | ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విఙ్ఞానం ముందు ఆయనకున్న చదువు, పరిజ్ఞానం ముందు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఏ మూలకీ సరిపోడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారుగుండు కింద మెదడు లేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్నుద్దేశించి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపైకేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణ భవన్లో కేటీఆర్ మాట్లాడుతూ.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు రేవంత్ రెడ్డికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కాకపోతే రేవంత్ రెడ్డి అదృష్టం. ఆయన జాక్పాట్ కొట్టిండు.. వేల కోట్ల రూపాయలున్నయ్. ఢిల్లీ మొఖాన డబ్బులు పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నడు. పీసీపీ పదవి కూడా కొనుక్కున్నడని ఆరోపించారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక పేద కుటుంబం నుంచి వచ్చి స్వతహాగా కష్టపడి ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఎదిగారు. రేవంత్ రెడ్డి చదువు లేదు.. సంధ్యలేదు.. బుద్ది, జ్ఞానం లేదు.. ఇవాళ జాక్పాట్లో డబ్బులు పెట్టి డబ్బులు కొనుక్కున్నడు. అయినంత మాత్రాన ఇలాంటి ఉన్నత విద్యావంతుడిని ఏ రకంగా వేధింపులకు గురిచేస్తున్నాడో ప్రజలంతా గమనిస్తున్నరు. వారికి రాబోయే రోజుల్లో తెలంగాణ సమాజం తప్పకుండా బుద్ది చెబుతుందన్నారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చదువు, ఙ్ఞానం ముందు రేవంత్ రెడ్డి ఏ మూలకీ సరిపోడు
అలాంటి వ్యక్తి గురించి ఎలాంటి బుద్ధి, ఙ్ఞానం లేని రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లు గుండు కింద మెదడు లేదు అని మాట్లాడుతుంటే ప్రజలు గమనిస్తున్నారు, తగిన గుణపాఠం చెప్తారు
– కేటీఆర్ pic.twitter.com/3h6DEwKRvm
— Telugu Scribe (@TeluguScribe) July 2, 2026