Hyderabad | ఇద్దరి మధ్య ప్రేమ తగ్గిందనే సూసైడ్.. కేపీహెచ్‌బీ దంపతుల మృతిలో కొత్త కోణం!
Hyderabad |హైదరాబాద్‌లోని కేపీహెచ్బీలో చిన్నారిని హతమార్చి, దంపతులు బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భార్య సమత రాసిన డైరీలో భర్త గోపీనాథ్ తనను మునుపటిలా ప్రేమించడం లేదని, పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
Hyderabad |హైదరాబాద్‌లోని కేపీహెచ్బీలో చిన్నారిని హతమార్చి, దంపతులు బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భార్య సమత రాసిన డైరీలో భర్త గోపీనాథ్ తనను మునుపటిలా ప్రేమించడం లేదని, పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ డైరీ ఆధారంగా దంపతుల మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
బెంగాలీ డైరీలో ఏముంది?
కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎంఐజీ నివాసంలో గత నెల 27న ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గోపీనాథ్ బుయిన్ (30), ఆయన భార్య సమత (26), వారి కుమార్తె స్నిగ్ధ (ఏడాది 11 నెలలు) మృతిచెందారు. ఘటనకు ముందు ఇంటి గోడపై దంపతులు ఓ లేఖ రాశారు. తమ మరణాలకు ఇతరులెవరూ కారణం కాదని, బంధువులను విచారించవద్దని అందులో పేర్కొన్నారు.
కేసు దర్యాప్తులో భాగంగా కేపీహెచ్‌బీ ఎస్‌హెచ్‌వో విజయ్‌కుమార్ పశ్చిమ బెంగాల్ నుంచి దంపతుల కుటుంబ సభ్యులను హైదరాబాద్‌కు పిలిపించారు. వారి సమక్షంలో ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తుండగా సమత రాసిన డైరీ లభించింది. అది బెంగాలీ భాషలో ఉండటంతో కుటుంబ సభ్యుల సాయంతో పోలీసులు చదివించారు. అనంతరం అందులోని విషయాలను హిందీలో తెలుసుకున్నారు.
భర్త పట్టించుకోవడం లేదని ఆవేదన!
గోపీనాథ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమత.. తొలినాళ్లలో ఉన్న ప్రేమ, అనుబంధం ఇప్పుడు కనిపించడం లేదని డైరీలో పేర్కొన్నట్లు సమాచారం. భర్త తనను మునుపటిలా చూసుకోవడం లేదని, పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. తన వైపు నుంచే ప్రేమ ఉందని, భర్త నుంచి అదే స్థాయిలో ప్రేమ లభించడం లేదని రాసినట్లు పోలీసులు గుర్తించారు. అనవసరంగా ఆయన జీవితంలోకి వచ్చాననే భావనను కూడా వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ డైరీలోని అంశాలతో దంపతుల మధ్య మనస్పర్థలు పెరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ విభేదాలే ఘటనకు కారణమని ఇప్పుడే నిర్ధారించలేమని, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్ నుంచి హైదరాబాద్‌కు..
గోపీనాథ్, సమత పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లా రాధామోహన్పూర్కు చెందినవారు. 2023లో ప్రేమ వివాహం చేసుకున్నారు. జీవనోపాధి కోసం రెండేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి కేపీహెచ్‌బీ మూడో ఫేజ్‌లో నివాసం ఉంటున్నారు. గోపీనాథ్ గచ్చిబౌలిలో చెఫ్‌గా పనిచేస్తుండగా, ఆయన సోదరులు కూడా నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో చెఫ్‌లుగా పనిచేస్తున్నారు. వారి చిన్నారి స్నిగ్ధతో ఎదురింట్లో ఉండే ఓ వృద్ధుడు రోజూ ఆడుకునేవాడు. ఈ క్రమంలో గత నెల 27వ తేదీన దంపతులు ఇంటి తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఇంటికి చేరుకుని లోపలికి వెళ్లగా దంపతులు, చిన్నారి మృతిచెంది కనిపించారు. అప్పట్లో గోడపై రాసిన లేఖ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తాజాగా సమత డైరీ లభించడంతో కేసు విచారణలో మరో కోణం వెలుగులోకి వచ్చింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఇద్దరి మధ్య ప్రేమ తగ్గిందనే సూసైడ్.. కేపీహెచ్‌బీ దంపతుల మృతిలో కొత్త కోణం!
IND vs NZ | ఐదో వన్డేలోనూ భారత్ తడబాటు.. 94 పరుగులకే నాలుగు వికెట్లు డౌన్!
Indiramma Illu | రూ.30వేలు ఇస్తేనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు.. తొర్రూర్‌లో అధికారుల పేరుతో లంచం డిమాండ్!
Kaaka | చిరంజీవి ‘కాకా’లో స్పెషల్ సాంగ్.. రితికా సింగ్‌తో మాస్ స్టెప్పులు, షూటింగ్ కూడా పూర్తి!
AI Technology | చాట్‌జీపీటీతో అద్భుతం.. రెండున్నరేళ్ల తర్వాత భర్త చెంతకు చేరిన తప్పిపోయిన భార్య!
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

