Vemulawada | వేములవాడ రాజన్న ఆలయ క్యూలైన్ వద్ద అగ్నిప్రమాదం.. భక్తులు లేకపోవడంతో తప్పిన ముప్పు!
Vemulawada | వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి ఆలయం ముందు ఉన్న ప్రచార రథం వద్ద భక్తులు వెలిగించిన దీపాలు ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Vemulawada | వేములవాడ టౌన్ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి ఆలయం ముందు ఉన్న ప్రచార రథం వద్ద భక్తులు వెలిగించిన దీపాలు ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే ఆ సమయంలో అక్కడ భక్తులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
కార్తీక మాసం కావడంతో రాజన్న దర్శనానికి వచ్చిన భక్తులు క్యూలైన్ వద్ద దీపాలు వెలిగించారు. ఈ క్రమంలో కొన్ని దీపాలు ప్రమాదవశాత్తు ఆలయ నిర్మాణం వైపు ఉన్న ఖాళీ స్థలంలో పడటంతో మంటలు వ్యాపించాయి. దీంతో ఆలయ పరిసరాల్లో కొద్దిసేపు ఆందోళన నెలకొంది. మంటలు చెలరేగిన విషయాన్ని తెలుసుకున్న ఆలయ అధికారులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో భక్తులు లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vemulawada | వేములవాడ రాజన్న ఆలయ క్యూలైన్ వద్ద అగ్నిప్రమాదం.. భక్తులు లేకపోవడంతో తప్పిన ముప్పు!
Hey Kannamma | యశ్ మాస్టర్, ధనశ్రీ వర్మ జోడిగా ‘హే కన్నమ్మ’.. టీజర్ విడుదల!
Hyderabad | ఇద్దరి మధ్య ప్రేమ తగ్గిందనే సూసైడ్.. కేపీహెచ్బీ దంపతుల మృతిలో కొత్త కోణం!
IND vs NZ | ఐదో వన్డేలోనూ భారత్ తడబాటు.. 94 పరుగులకే నాలుగు వికెట్లు డౌన్!
Indiramma Illu | రూ.30వేలు ఇస్తేనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు.. తొర్రూర్లో అధికారుల పేరుతో లంచం డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

