నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డైరెక్టర్‌గా డాక్టర్ ఎస్. రామ్మూర్తికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం నిమ్స్ డీన్‌గా ఉన్న ఆయన నెలరోజుల పాటు డైరెక్టర్ బాధ్యతలు కూడా నిర్వర్తించనున్నారు. మెడికల్ గ్రౌండ్స్‌పై డైరెక్టర్ డాక్టర్ కె.మనోహర్ నెల రోజుల సెలవు తీసుకున్నారు. ఆయన సెప్టెంబరు 2 నుంచి అక్టోబరు 2 వరకు అందుబాటులో ఉండరు. ఈ సమయంలో నిమ్స్ డైరెక్టర్ బాధ్యతలను కూడా డీన్ రామ్మూర్తి నిర్వర్తించనున్నారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం సర్కులర్ జారీ చేసింది.