మేడ్చల్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని పీహెచ్సీ, యూపీహెచ్‌సీల్లో కాంట్రాక్ట్ బేసిక్‌లో విధులు నిర్వహించే ఎన్హెచ్ఎంల ఉద్యోగులతో పాటు ఫార్మాసిస్ట్ స్టాఫ్, అకౌంటెంట్ల ఆధార్ బేసిడ్ హాజరు లేదన్న నెపం కారణంగా ఉద్యోగుల్లో వేతనాల కోతను విధించారు. దీంతో జిల్లాలో విధులు నిర్వహించే ఎన్‌హెచ్‌ఎంలు కలెక్టరేట్‌ను ముట్టడించి కలెక్టర్ మను చౌదరి, డీఎంహెచ్‌వోలకు వినతి పత్రం సమర్పించారు. వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఎన్హెచ్ఎంల ఉద్యోగులకు మద్దతుగా మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సెకండ్ ఏఎన్ఎంల జీతాల్లో కోతలు విధించడం అన్యాయమన్నారు.